పంచలోహ విగ్రహాల చోరీ | panchaloha statues missing in temple | Sakshi
Sakshi News home page

పంచలోహ విగ్రహాల చోరీ

Aug 28 2015 10:56 AM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని మల్లన్న ఆలయంలో చోరీ జరిగింది.

పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని మల్లన్న ఆలయంలో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి దొంగలు ఆలయంలోకి ప్రవేశించి రెండు పంచలోహ విగ్రహాలతో పాటు హుండీని పగులగొట్టి అందులోని నగదుతో పరారయ్యారు. అలాగే, గ్రామంలో ఆగి ఉన్న ఆర్టీసీ నైట్ హాల్ట్ బస్సు బ్యాటరీలను కూడా ఎత్తుకు పోయారు. శుక్రవారం ఉదయం విగ్రహాల చోరీపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement