breaking news
panchaloha statue
-
నల్లగొండలో పంచలోహ విగ్రహాల చోరీ
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మేళ్ల చెరువు మండలం మల్లారెడ్డి గూడెంలోని ఉమామహేశ్వర ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చోరీ చేసిన విగ్రహాలను శుక్రవారం అమ్మకానికి తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది దుండగులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంచలోహ విగ్రహాలు లభ్యం
త్రిపురారం: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం సత్యనారాయణపురం గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామ శివారులో పడి ఉన్న విగ్రహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని దుండగులు గ్రామ శివారులో వాటిని వదిలి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ సుమారూ రూ. 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
పంచలోహ విగ్రహాల చోరీ
పెద్ద అంబర్పేట: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అనాజ్పూర్ గ్రామంలోని మల్లన్న ఆలయంలో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి దొంగలు ఆలయంలోకి ప్రవేశించి రెండు పంచలోహ విగ్రహాలతో పాటు హుండీని పగులగొట్టి అందులోని నగదుతో పరారయ్యారు. అలాగే, గ్రామంలో ఆగి ఉన్న ఆర్టీసీ నైట్ హాల్ట్ బస్సు బ్యాటరీలను కూడా ఎత్తుకు పోయారు. శుక్రవారం ఉదయం విగ్రహాల చోరీపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పంచలోహ విగ్రహాలు స్వాధీనం, ఏడుగురి అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలో పంచలోహ విగ్రహాల విక్రయ ముఠాను పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.15 లక్షల విలువ చేసే ఏడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ అయిన వారిలో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసే షేక్సావలీ అనే కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు పోలీసుఉన్నతాధికారులు తెలిపారు. నిందితులను ఇంతుకు ముందే అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం రిమాండ్ కు తరలించారు.