నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం సత్యనారాయణపురం గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి.
త్రిపురారం: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం సత్యనారాయణపురం గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామ శివారులో పడి ఉన్న విగ్రహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని దుండగులు గ్రామ శివారులో వాటిని వదిలి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ సుమారూ రూ. 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.