అనంతపురం జిల్లాలో పంచలోహ విగ్రహాల విక్రయ ముఠాను పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలో పంచలోహ విగ్రహాల విక్రయ ముఠాను పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.15 లక్షల విలువ చేసే ఏడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ అయిన వారిలో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసే షేక్సావలీ అనే కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు పోలీసుఉన్నతాధికారులు తెలిపారు. నిందితులను ఇంతుకు ముందే అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం రిమాండ్ కు తరలించారు.