ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యకారులకు భారీ చేపలు లభిస్తున్నాయి. వారం క్రితం ఓ మత్స్యకారుడికి 22 కిలోల బండజల్ల పడగా.. శుక్రవారం ఎర్రగడ్డతండాకు చెందిన మత్స్యకారుడి వలలో 18 కిలోల గ్యాస్‌కట్ చేప చిక్కింది. ఈ చేపను కిలో రూ.200 చొప్పున విక్రయించాడు. ఇటీవల భారీ వర్షాలతో రిజర్వాయర్‌కు వరద చేరగా, సాగర్ నుంచి జలాలు సరఫరా అవుతున్నాయి. దీంతో పెద్ద చేపలు రిజర్వాయర్‌కు చేరుతున్నట్లు భావిస్తున్నారు.


