breaking news
catfish size
-
4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు!
బీహార్‌లోని బెతియా జిల్లాలో మత్స్యకారుల వలకు విచిత్రమైన చేప చిక్కింది. ఆ చేపను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. బెతియా జిల్లాలలోని లాకఢ్ గ్రామంలోని మత్స్యకారుల చేతికి ఈ చేప చిక్కింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో వల వేసినప్పుడు వారికి ఈ చేప చిక్కింది. తొలిసారి చూసినప్పుడు ఈ చేప విమానం మాదిరిగా కనిపిస్తుంది. ఈ చేప నల్లని చారలను కలిగివుంది. దానికి నాలుగు కళ్లు ఉన్నాయి. ఈ చేపను సకెర్మౌత్ క్యాట్‌ఫిష్ అని అంటారు. ఈ తరహా చేపలు సాధారణంగా అమెరికాలో ప్రవహించే నదులలో కనిపిస్తాయి. వింతగా కనిపిస్తున్న ఈ చేపను చూసేందుకు సమీపగ్రామ ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ తరహా చేపలు ఇతర చేపల గుడ్లను తినేస్తుంటాయి. ఫలితంగా ఈ చేపలు ఇతర చేపల మనుగడకు ముప్పుగా భావిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరేంద్ర చౌదరి ఇక్కడికి సమీపంలోని నదిలో ఇటువంటి రెండు చేపలను పట్టుకున్నారు. ఈ చేపలను వీరేంద్ర చౌదరి తన ఇంటిలో సురక్షితంగా ఉంచారు. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ చేపను అందం కోసం జనం ఇంటిలోని ఫిఫ్ అక్వేరియంలలో ఉంచుతారు. అయితే ఎవరో ఇటువంటి చేపలను నదిలో విడిచిపెట్టి ఉంటారు. ఫలితంగా ఈ చేపలు మరింత వృద్ధి చెంది, గండక్, కోసీ గంగా నదులలో కనిపిస్తున్నాయి. అయితే నదిలో ఈ చేపలు ఉండటం పలు జలచరాలకు ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి? -
భారీగా క్యాట్ ఫిష్ లు పట్టివేత
విజయవాడ: నూజివీడు - హనుమాన్ జంక్షన్ రహదారిలోని మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల క్యాట్ ఫిష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గరు వ్యక్తులతోపాటు లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. క్యాట్ ఫిష్‌ను కైకలూరు నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు నిందితులు తమ దర్యాప్తులో వెల్లడించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.