నల్లగొండ జిల్లాలోని మేళ్ల చెరువు మండలం మల్లారెడ్డి గూడెంలోని ఉమామహేశ్వర ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి.
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మేళ్ల చెరువు మండలం మల్లారెడ్డి గూడెంలోని ఉమామహేశ్వర ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చోరీ చేసిన విగ్రహాలను శుక్రవారం అమ్మకానికి తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది దుండగులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.