ఆటో-తవేరా ఢీ.. మహిళ మృతి | one dies of auto and tavera accident | Sakshi
Sakshi News home page

ఆటో-తవేరా ఢీ.. మహిళ మృతి

Jun 29 2015 10:39 AM | Updated on Sep 3 2017 4:35 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ సమీపంలో సోమవారం ఉదయం జరిగింది.

నిజామాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. నాగారం గ్రామానికి చెందిన పోచమ్మ(48) అనే మహిళ పచ్చకామెర్లకు మందు తీసుకోవడం కోసం ఎంచ గ్రామానికి ఆటోలో బయలుదేరింది. ఆటో అబ్బాపూర్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న తవేరా వాహనం ఆటోను ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న పోచమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాతులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement