Hyd: అయ్యో.. అంతా క్షణాల్లోనే..! | Auto Carrying Iron Pipes Overturns On Scooty In Balanagar Hyderabad | Sakshi
Sakshi News home page

Hyd: అయ్యో.. అంతా క్షణాల్లోనే..!

Oct 8 2026 7:41 PM | Updated on Oct 8 2026 8:04 PM

Auto Carrying Iron Pipes Overturns On Scooty In Balanagar Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: బాలానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న ఆటో.. స్కూటీపై బోల్తాపడింది. ప్రమాదంలో స్కూటీ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోషల్‌ మీడియాలో ఈ ప్రమాద ఘటన వైరల్‌గా మారింది. పోలీసులు, ఆర్టీఓ అధికారులు కళ్లు మూసుకున్నారా? స్కూటీ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? రోడ్డుపై వెళ్తున్న ఎవరికి అయినా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇతరుల భద్రతను పట్టించుకోకుండా సామర్థ్యానికి మించి భారీగా సరుకులు తరలిస్తున్న వాహనాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎడమ కంటికి బదులు కుడికన్నుకు ఆపరేషన్‌

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement