లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

Oct 12 2015 3:23 PM | Updated on Aug 30 2018 3:56 PM

వరంగల్ జిల్లా జనగామ బస్టాండ్ వద్ద లారీ ఢీకొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.

జనగామ ( వరంగల్) : వరంగల్ జిల్లా జనగామ బస్టాండ్ వద్ద లారీ ఢీకొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామానికి చెందిన సుంకోజు అనంద్ ఫ్యాషన్ ప్రో బండి కొనుగోలు చేశాడు. దీని రిజిస్ట్రేషన్ కోసం సోమవారం ఆనంద్, అతని తమ్ముడు కృష్ణమూర్తి కొత్త బైక్‌పై జనగామకు వెళుతున్నారు.

కృష్ణమూర్తి బైక్ నడుపుతుండగా, ఆనంద్ వెనుక కూర్చున్నాడు. బైక్ జనగామ బస్టాండ్ ప్రవేశ ద్వారం వద్దకు రాగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఆనంద్‌ను ఢీకొంది. దీంతో అతడు ఎగిరి రోడ్డుపై పడిపోగా, అతనిపై నుంచి లారీ ముందుకు వెళ్లిపోయింది. దీంతో అతడు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో కృష్ణమూర్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement