లారీ ఢీకొని ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఒకరు మృతి

Oct 6 2015 7:58 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీరాంపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీరాంపూర్ మండలానికి చెందిన నాగరాజు, సుచిత దంపతులు తమ నాలుగు నెలల కుమార్తెతో బైక్‌పై మంచిర్యాలకు బయలుదేరారు. సీసీ కాంప్లెక్స్ సమీపంలో వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే చనిపోగా సుచిత తీవ్రంగా గాయపడింది. చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement