బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి | one dies in a lorry and bike collisioned incident in suryapet district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి

Feb 16 2017 9:04 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. వెనక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement