బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు | One dead and Two injured in Road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Jan 8 2016 7:30 PM | Updated on Aug 30 2018 3:58 PM

నల్లగొండ జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కీర్తి సాయికుమార్ (19), సింగిరెడ్డి దినేష్‌రెడ్డి (19), ఇప్పాలపల్లి హరీష్ (21)లు ఒకే బైక్‌పై టేకుల సోమారం గ్రామానికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్‌రెడ్డి, హరీష్‌లకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement