మరోసారి మేయర్‌కు పరీక్షలు | Once Again Corona Tests For Mayor Bonthu Rammohan | Sakshi
Sakshi News home page

మరోసారి మేయర్‌కు పరీక్షలు

Jun 13 2020 1:13 AM | Updated on Jun 13 2020 1:13 AM

Once Again Corona Tests For Mayor Bonthu Rammohan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శుక్రవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటికే ఆయనకు పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆయన పేషీలోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వైద్యులు మేయర్‌కు మరోసారి పరీక్షలు చేశారు. మేయర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, మేయర్‌ పేషీ సహ బల్దియా ప్రధాన కార్యాలయంలో వారంలో మొత్తం 3 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో అధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే వారిలో శుక్రవారం దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement