‘విష జ్వరాలన్నీ డెంగీ కాదు’

Not every toxic fever is dengue - Sakshi

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ప్రతి విష జ్వరం డెంగీ కాదని, ప్రతి జ్వరం మలేరియా కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రకరకాల వైరల్‌ ఫీవర్స్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు, సెలైన్‌ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో కలసి సూర్యాపేటలోని జనరల్‌ ఆస్పత్రిని తనిఖీ చేశారు.  అక్కడ అందుతున్న సేవలపై రోగులను ఆరా తీశారు. మెడికల్‌ కళాశాల భవనా న్ని పరిశీలించారు.

విషజ్వరాలపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది నెల రోజులు సెలవు పెట్టొద్దని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆస్పత్రులకు ఏ లోటు లేకుండా చూస్తామని చెప్పారు. కాగా, నల్లగొండ రహ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌రఫీ కుమార్తె ఆఫీయా మెహ్వీన్‌ (7) డెంగీ వ్యాధి సోకి ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతి చెందింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top