వారితో పార్టీకి నష్టమేమీ లేదు:కుంతియా | no problem for congress with leaders quit from party, khuntia | Sakshi
Sakshi News home page

వారితో పార్టీకి నష్టమేమీ లేదు:కుంతియా

Nov 3 2014 7:24 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారితో పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ కార్యదర్శి ఆర్ సీ కుంతియా తెలిపారు.

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారితో పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ కార్యదర్శి ఆర్ సీ కుంతియా తెలిపారు. సోమవారం గాంధీభవన్ లో టీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతల వలసలు, పార్టీ పరిస్థితిపై కుంతియా సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో పార్టీ స్థితిగతులపై మాట్లాడిన ఆయన పార్టీని వీడుతున్న నేతలతో కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరడానికి కూడా ఇతర పార్టీల నేతలు సిద్దంగా ఉన్నారన్నారు. 

 

పార్టీ ఫిరాయింపులను స్థానిక నాయకత్వ వైఫల్యంగా భావించలేమని ఆయన అన్నారు. కాంగ్రెస్ తోనే తెలంగాణకు మేలు జరుగుతుందనే విషయాన్ని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement