'నక్సల్స్ విషయంలో విధానం మారలేదు' | 'no policy changed towords Maoists ' | Sakshi
Sakshi News home page

'నక్సల్స్ విషయంలో విధానం మారలేదు'

Dec 9 2015 3:42 PM | Updated on Oct 9 2018 2:51 PM

నక్సల్స్ విషయంలో తమ విధానం మారలేదని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.

నక్సల్స్ విషయంలో తమ విధానం మారలేదని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.  బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన అత్యాధునిక టెక్నాలజీ తో పోలీసు శాఖకు కొత్త హంగులను జత చేస్తామని తెలిపారు. ఎఫ్ ఆర్ ఐ తో సహా అన్నీ ఆన్ లైన్ చేస్తామని చెప్పారు.

మరో వైపు పోలీస్ రిక్రూట్ మెంట్ లో తరచూ వివాదాస్పదమైతున్న 5కే రన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement