'ఉల్లంఘిస్తే అరెస్ట్లు తప్పవు' | No permission to TPCC leaders padayatra, says city police | Sakshi
Sakshi News home page

'ఉల్లంఘిస్తే అరెస్ట్లు తప్పవు'

Feb 7 2015 9:32 AM | Updated on Sep 2 2017 8:57 PM

సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించొద్దంటూ టీ పీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనుంది.

హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించొద్దంటూ టీ పీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనుంది. కాగా ఈ పాదయాత్రకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. తాము అనుమతి కోరిన పోలీసులు నిరాకరించారంటూ టీ పీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రలో పాల్గొనే నేతలు, కార్యకర్తలను తరలించేందుకు పోలీసులు వాహనాలను సిద్ధం చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. అరెస్ట్లు తప్పవంటూ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డకు... చెస్ట్ ఆసుపత్రిని అనంతగిరికి తరలించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయా పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించి... గవర్నర్కు వినతిపత్రం సమర్పించాలని భావించారు. పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరగా... వారు నిరాకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement