
పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ విద్యాశాఖ స్ప ష్టం చేసింది.
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యం లో పాఠశాలలు పునఃప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్ప ష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవే టు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించింది. (విద్యార్థులకు పాఠం చెప్పేదెలా?)
అదేవిధంగా పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ బుధవారం ప్రొసీడింగ్ జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రొసీడింగ్‌లో స్పష్టం చేశారు.