రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి | nizamabad residents killed in Maharashtra Road Mishap | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Jun 15 2014 10:01 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి గ్రామ సమీపంలోని లాగావ్ పాటక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన నలుగురు మృతి చెందారు

బోధన్:  మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి గ్రామ సమీపంలోని లాగావ్ పాటక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బంధువుల కథనం ప్రకారం...

బోధన్ పట్టణం గోషాలకాలనీకి చెందిన షేక్ అన్వర్ (29) తన భార్యాపిల్లలతో కలిసి నర్సిలో జరిగే బంధువుల ఫంక్షన్‌కు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. నర్సికి ఐదు కిలోమీటర్ల సమీపంలోని లాగవ్ పాఠక్ వద్ద ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అన్వర్, ఆయన భార్య పర్వీన్ బేగం (25) కొడుకు వాహెద్(3) కూతురు నిదా (18 నెలలు) మృతి చెందారు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. నాయ్‌గావ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బోధన్‌కు తరలించారు. మృతి చెందిన పర్వీన్‌ బేగం గర్భిణీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement