మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు అరెస్ట్ | nigerians arrested in Karimnagar district of Telangana | Sakshi
Sakshi News home page

మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు అరెస్ట్

Jun 4 2016 8:20 AM | Updated on Oct 17 2018 5:28 PM

కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడే ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ శనివారం వెల్లడించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడే ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ శనివారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన తెడ్డిమిలాన్, కెల్విన్‌తోపాటు వారికి దేశంలో సహకరిస్తున్న మహ్మద్‌హాసిన్‌ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకుని ఇక్కడకు తరలించారు

‘మీరు ఆన్‌లైన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్నారు’ అంటూ మెయిల్ ద్వారా సమాచారం పంపుతారని, దాన్ని నమ్మి రిప్లయ్ ఇచ్చిన వారి నుంచి కొంత నగదు రాబట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన పలువురిని మోసగించారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి రూ.2.50లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement