breaking news
karimnagar sp
-
మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు అరెస్ట్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడే ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ శనివారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన తెడ్డిమిలాన్, కెల్విన్‌తోపాటు వారికి దేశంలో సహకరిస్తున్న మహ్మద్‌హాసిన్‌ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకుని ఇక్కడకు తరలించారు ‘మీరు ఆన్లైన్లో కోటి రూపాయలు గెలుచుకున్నారు’ అంటూ మెయిల్ ద్వారా సమాచారం పంపుతారని, దాన్ని నమ్మి రిప్లయ్ ఇచ్చిన వారి నుంచి కొంత నగదు రాబట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన పలువురిని మోసగించారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి రూ.2.50లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
తాగుబోతు పోలీసుల సస్పెన్షన్
మందుకొట్టి పోలీస్ స్టేషన్లోనే పోట్లాడుకున్న వ్యవహారంలో కొంతమంది పోలీసులను కరీంనగర్ ఎస్పీ సస్పెండ్ చేశారు. ముల్కనూరు ఏఎస్ఐ వీరయ్య, చొప్పదండి హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య, కానిస్టేబుళ్లు సాధీర్, భూమయ్యలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించినందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం కరీంనగర్ ఎస్పీ శివకుమార్ ప్రకటించారు. గతవారం ఓ విందులో పాల్గొని అతిగా మద్యం తాగిన తర్వాత చొప్పదండి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య, కానిస్టేబుల్ భూమయ్యలతో మరో వ్యక్తికి మామూళ్ల విషయంలో మాటామాటా పెరగడంతో పరస్పరం దూషించుకుంటూ ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ వ్యవహారమంతా స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఎస్పీ వీరిని సస్పెండ్ చేశారు.