
తాగుబోతు పోలీసుల సస్పెన్షన్
మందుకొట్టి పోలీస్ స్టేషన్లోనే పోట్లాడుకున్న వ్యవహారంలో కొంతమంది పోలీసులను కరీంనగర్ ఎస్పీ సస్పెండ్ చేశారు. ముల్కనూరు ఏఎస్ఐ వీరయ్య, చొప్పదండి హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య, కానిస్టేబుళ్లు సాధీర్, భూమయ్యలు సస్పెండ్ అయ్యారు.
మందుకొట్టి పోలీస్ స్టేషన్లోనే పోట్లాడుకున్న వ్యవహారంలో కొంతమంది పోలీసులను కరీంనగర్ ఎస్పీ సస్పెండ్ చేశారు. ముల్కనూరు ఏఎస్ఐ వీరయ్య, చొప్పదండి హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య, కానిస్టేబుళ్లు సాధీర్, భూమయ్యలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించినందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం కరీంనగర్ ఎస్పీ శివకుమార్ ప్రకటించారు.
గతవారం ఓ విందులో పాల్గొని అతిగా మద్యం తాగిన తర్వాత చొప్పదండి పోలీస్ స్టేషన్కు చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య, కానిస్టేబుల్ భూమయ్యలతో మరో వ్యక్తికి మామూళ్ల విషయంలో మాటామాటా పెరగడంతో పరస్పరం దూషించుకుంటూ ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ వ్యవహారమంతా స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఎస్పీ వీరిని సస్పెండ్ చేశారు.