కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి | Newborn child due to Nurse treats pregnant | Sakshi
Sakshi News home page

కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి

Sep 12 2017 12:30 PM | Updated on Sep 19 2017 4:26 PM

వైద్యుల నిర్లక్ష్యంతో మగశిశువు మృతి చెందిన సంఘటన జిల్లా ప్రాంతీయ అస్పత్రిలో చోటుచేసుకుంది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : వైద్యుల నిర్లక్ష్యంతో మగశిశువు మృతి చెందిన సంఘటన జిల్లా ప్రాంతీయ అస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ మండలంలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన శివమ్మ అనే గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున 5:30 గం.ల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు.

వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి సాధారణ కాన్పు జరుగుతుందని భరోసా కల్పించారు. శివమ్మకు సాయంత్రం నొప్పులు అధికమవడంతో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు ఆమెకు కాన్పు చేశారు. ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. నర్సులు కాన్పు సరిగ్గా చేయక పోవడంతో పుట్టిన శిశివు కాన్పు అయిన వెంటనే మరణించినట్లు బంధువులు తెలిపారు. దీంతో బాధితులు ఆస్పత్రి ఆవరణలో వైద్యులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement