మహిళా కండక్టర్ల ఆప్రాన్‌ ఇలా..

New Dress Code For Lady Conductor Soon In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో బస్సుల్లోని మహిళా కండక్టర్లు చెర్రీ రెడ్‌ కలర్‌ ఆప్రాన్‌ ధరించనున్నారు. మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్‌ రంగు ఎంపిక చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతానికి ఈ నమూనా ను ఎంపిక చేశారు. ఒక్కో మహిళా కండక్టర్‌కు ఇలాంటివి రెండు ఆప్రాన్లు, లేసుల్లేని షూ జత ఇస్తారు. మహిళా అధికారి సుధ ఆధ్వర్యంలో కొందరు మహిళా కండక్టర్లతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రంగును ఎంపిక చేసి ఎండీకి నివేదిక అందజేసింది. మరోవైపు చెర్రీ ఎరుపు రంగు వస్త్రం కోసం రేమండ్స్‌ షోరూమ్‌లను అధికారులు సంప్రదించారు. ఆప్రాన్‌ కోసం 8 వేల మీటర్ల వస్త్రం కావాల్సి ఉంది. చెర్రీ ఎరుపు అందుబాటులో లేని పక్షంలో దాన్ని మార్చే అవకాశం ఉంది. దాని బదులు ప్రత్యామ్నాయంగా నీలి రంగును ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top