breaking news
lady conductors
-
మహిళా కండక్టర్ అనుభవాలు
-
మహిళా కండక్టర్లతో కలిసి సాక్షి ఒక రోజు
-
ఇక తెలంగాణలో ‘మెరూన్’ కండక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఇక మెరూన్ రంగు ఆప్రాన్ (చొక్కా) ధరించి ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధులు నిర్వహించనున్నారు. 2019 చివరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకు మహిళా కండక్టర్లకు సరికొత్త యూనిఫామ్స్ ఎట్టకేలకు అందబోతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న 4,800 మంది మహిళా కండక్టర్ల కోసం రేమండ్స్ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్ని తాజాగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో కండక్టర్‌కు రెండు ఆప్రాన్‌లకు సరిపడా వస్త్రాన్ని సరఫరా చేస్తారు. వారు తమ కొలతలకు తగ్గట్టు కుట్టించుకుని, నిత్యం ఆప్రాన్ ధరించి డ్యూటీకి రావాల్సి ఉంటుంది. 60 లక్షల కోసం ఏడాది ఎదురుచూపు.. 2019లో ఆర్టీసీలో రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా సాగిన సమ్మె అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అందులో వివిధ అంశాలపై నేరుగా ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్న విషయాల ఆధారంగా పలు హామీలిచ్చారు. అందులో మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఆప్రాన్‌ను యూనిఫాంగా ఇవ్వాలన్నది కూడా ఒకటి. ఈ ఆప్రాన్ ఏ రంగులో ఉండాలన్నది కూడా మహిళా కండక్టర్లే నిర్ణయించి చెప్పాలంటూ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంది. ఎక్కువ మంది మెరూన్ రంగు వస్త్రం కావాలని కోరటంతో దాన్నే సిఫారసు చేసింది. వస్త్రం నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రేమండ్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ వస్త్రాన్ని కొనేందుకు ఏడాదికిపైగా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీలో ఉన్న 4,800 మంది మహిళా కండక్టర్లకు రెండు ఆప్రాన్లు కుట్టివ్వాలంటే 30 వేల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిర్ధారించారు. అయితే జీతాలకు కూడా డబ్బులు చాలని పరిస్థితిలో అంతమేర నిధులను కూడా కేటాయిం చటం ఆర్టీసీకి కష్టంగా మారింది. ఆ వెంటనే బస్సు చార్జీలు పెంచటంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.2 కోట్లు పెరిగింది. దీంతో వస్త్రం కొనాలనుకున్న తరుణంలో కోవిడ్ రూపంలో సమస్య ఎదురైంది. గత వారం, పది రోజులుగా ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు వస్త్రం కొనుగోలు చేశారు. సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వస్త్రం మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టే ఆర్టీసీలో ప్రతి మూడేళ్లకు ఓసారి రెండు జతల చొప్పున యూనిఫాం ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటున్నారు. కొంతమంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఉన్న వస్త్రం కొంత స్టోర్‌లో ఉండిపోవటంతో కొన్ని డిపోలకు మధ్యలో ఒకసారి యూనిఫాం సరఫరా అయింది. యూనిఫాం లేకుండా డ్యూటీకి హాజరైతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు జేబు నుంచి ఆ ఖర్చు భరిస్తున్నారు. అయితే ఈ కొత్త యూనిఫాం కూడా మహిళలకు మాత్రమే ఇవ్వనున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. చదవండి: మేడ్చల్ బస్ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ -
మహిళా కండక్టర్ల ఆప్రాన్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: త్వరలో బస్సుల్లోని మహిళా కండక్టర్లు చెర్రీ రెడ్ కలర్ ఆప్రాన్ ధరించనున్నారు. మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్ రంగు ఎంపిక చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతానికి ఈ నమూనా ను ఎంపిక చేశారు. ఒక్కో మహిళా కండక్టర్‌కు ఇలాంటివి రెండు ఆప్రాన్లు, లేసుల్లేని షూ జత ఇస్తారు. మహిళా అధికారి సుధ ఆధ్వర్యంలో కొందరు మహిళా కండక్టర్లతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ రంగును ఎంపిక చేసి ఎండీకి నివేదిక అందజేసింది. మరోవైపు చెర్రీ ఎరుపు రంగు వస్త్రం కోసం రేమండ్స్ షోరూమ్‌లను అధికారులు సంప్రదించారు. ఆప్రాన్ కోసం 8 వేల మీటర్ల వస్త్రం కావాల్సి ఉంది. చెర్రీ ఎరుపు అందుబాటులో లేని పక్షంలో దాన్ని మార్చే అవకాశం ఉంది. దాని బదులు ప్రత్యామ్నాయంగా నీలి రంగును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. -
‘బస్’తీ మే సవాల్!
క్షణం తీరిక లేని షెడ్యూళ్లు, విశ్రాంతి తీసుకుందామంటే కుదరని పరిస్థితులు, రాత్రి పది దాటినా తరగని డ్యూటీలు మహిళా కండక్టర్లకు నిత్యం సవాళ్లు విసురుతున్నాయి. ఆర్టీసీలో పని చేస్తున్న అతివలు అనునిత్యం కష్టాలతో ప్రయాణిస్తున్నారు. వసతుల లేమి, పర్యవేక్షణ లోపంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవించాల్సి వస్తోంది. మహిళలంటే ఇంటి పని తప్పనిసరి. అవి చూసుకుని డ్యూటీకి వస్తుంటే కనీసం నిబంధనల ప్రకారం కల్పించాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం లేదు. ఫలితంగా పడతులు నలిగిపోతున్నారు. అడుగడుగునా ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం ఒకటి, శ్రీకాకుళం రెండు డిపోలు, పాలకొండ, టెక్కలి, పలాస తదితర ఐదు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో పనిచేసే మొత్తం కండక్టర్లు 690 మంది. కాగా 525 మంది పురుష కండక్టర్లు అయితే 165మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. ఇందులో శ్రీకాకుళం ఒకటో డిపోలో 29 మంది మహిళలు, శ్రీకాకుళం రెండో డిపోలో 48, పాలకొండ డిపో పరిధిలో 44, టెక్కలి డిపో పరిధిలో 20, పలాస డిపో పరిధిలో 24 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఆయా డిపోల పరిధి లో విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలు నిర్వహించే సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ స్సుల రూట్లలో ఉన్న ఎగుడు, దిగుడు గుం తల కారణంగా నడుమ, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నామని వారు చెబుతున్నారు. వేకువజాము నుంచి.. సూరీడు రాక ముందే ఆరంభమయ్యే కండక్టర్ల విధులు చిమ్మచీకటి వరకు సాగుతాయి. అందులోనూ నిత్యం జనాల మధ్య ఉండాల్సిన జాబు కావడంతో కాసింతైనా విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. కానీ మహిళా కండక్టర్లకు ఆ కాసింత భాగ్యం దక్కడం లేదు. విధి నిర్వహణలో తగిన విశ్రాంతి లేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పనిచేసే చోట పలు రకాల ఇబ్బందులు తప్పడం లేదు. ఆకతాయిలు, మందుబాబులు, మరో వైపు తోపులాటలు భరిస్తూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. నిబంధనల మేరకు సంస్థలో కార్మికులంతా 8గంటలు పనిచేయాల్సి ఉన్నా 12 నుంచి 15గంటలపాటు పనిచేయించుకుంటున్నారు. దీంతో ఎక్కువమంది మహిళా కండక్టర్లు మానసిక ఒత్తిడిలకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. పని.. పని.. పని జిల్లా ఆర్టీసీ పరిధిలో పనిచేసే ఐదు డిపోల్లో 165 మం ది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. వీరు రోజుకు 8 గంటలు పని చేస్తో సరిపోతుంది. కానీ ఓటర్ టైమ్ అంటూ వీరికి అనువు కాని సమయాల్లో విధులు వేస్తున్నారు. రోజుకు 12 నుంచి 15గంటల పాటు తప్పనిసరిగా పని చేయాల్సి రావడంతో వీరు డస్సిపోతున్నా రు. ఇంటి పనులకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఓవర్‌టైం విధులు వేయకుండా పగటి పూట విధులు చేసేలా డ్యూటీ చార్టులు వేయాలని మహిళా కండక్టర్లు కోరుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. విశ్రాంతి గదులేవీ? జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో మహిళా కండక్టర్లు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లా పరిధిలోని ఐదు డిపోల్లో ఒక్క డిపోలో కూడా విశ్రాంతి గదులు లేవు. ఇతరత్రా మౌలి క సదుపాయాలు కల్పించడంలోనూ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. డ్యూటీకి వెళ్లాల్సిన మహిళలు గంట ముందే వస్తే కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు గదులు లేవు. ఇంటికి వెళ్లాలంటే కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లోనే కాసేపు సేద తీరుతున్నారు. వారి కోసం ప్రత్యేక చార్టు డ్యూటీలు వేయాలని కోరుతు న్నా అధికా రులు ఎవ్వరూ స్పందించడం లేదు. కొంతమంది మహిళా సిబ్బందిని పల్లె వెలుగు, ఇతర ఆర్డినరీ సర్వీస్ డ్యూటీలకు పంపుతున్నారు. దీంతో వారు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. మహిళా సిబ్బంది అనా రోగ్యానికి గురైనపుడు నిబంధనల మేరకు వేచి చూడాలి. అక్కడ నిల్చుంటే ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. ఆటోల్లో, ఇతర వాహనాల్లో వెళ్లాలంటే రాత్రిపూట అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. సాయంత్రం సరికి డ్యూటీలు ముగిసేలా డ్యూటీలు వేయాలని వేడుకుంటున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. మగవారితో సమానంగా జీతా లు ఇస్తున్నాం కదా, అలాంటప్పుడు డ్యూటీలు కూడా వారితో సమానంగా చేయాల్సిందేనని చెబుతున్నారు. రాత్రి 10 దాటినా విధుల్లోనే రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా విధుల్లో మహిళా సిబ్బంది కనిపిస్తున్నారు. వీరు ఎక్కడా రాజీ పడకుండా విధులు నిర్వహిస్తున్నారు. విధులు కేటా యించడంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నా అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. 8గంటలు డ్యూటీ విధులు కన్నా అదనంగా 4గంటలు నుంచి 6గంటలు చేస్తే మరసటి రోజు సెలవు తీసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నా అది అమలు కావడం లేదు. రాత్రి 10గంటలు తర్వాత డ్యూటీ ముగించుకుని తిరిగి డిపోకు చేరుకుని డబ్బులు లెక్క కట్టి ఇంటికి వెళ్లే లోపు అర్ధరాత్రి అవుతోందని పలువురు మహిళా కండక్టర్లు చెబుతున్నారు. పనిభారం లేకుండా చూస్తాం సాధ్యమైనంత వరకూ మహిళా కండక్టర్లపై పనిభారం లేకుండా చూస్తాం. మహిళలకు మూడు రోజుల సెలువులు మంజూరుకు అనుమతులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన అనుమతులు అన్ని డిపోలకు పంపిస్తాం. అన్ని డిపోల్లో విశ్రాంతి గదులు కూడా నిర్మించనున్నాం. శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో ఇప్పటికే విశ్రాంతి గది నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ప్రారంభిస్తాం. సాధ్యమైనంత వర కూ సింగిల్ డ్యూటీలు వేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో మాత్రమే డబుల్ డ్యూటీకి పంపుతాం. – కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పట్టించుకోవడం లేదు ఏపీఎస్ ఆర్టీసీలో 18 ఏళ్లుగా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. మహిళా కండక్టర్లకు కనీస సౌకర్యాలు లేవు. విధి నిర్వహణ సమయంలో డ్యూటీకి, డ్యూటీకి మధ్య వ్యవధిలో కనీస విశ్రాంతి తీసుకునేందుకు కూడా విశ్రాంతి గదులు లేవు. ఇక విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణించలేనివి. విధి నిర్వహణలో ఓటీ చేసినపుడు రాత్రి 10.15గంటల సమయం అవుతుంది. ఆ సమయంలో ఇంటికి చేరుకోవాలంటే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. – జీవీ రమణమ్మ, మహిళా కండక్టర్ విద్యార్థులతో ఇబ్బందులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులతో ప్రతి రోజూ ఉద యం పూట, సాయంత్రం సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. బస్సుల్లో ప్రయాణించే సమయాల్లో ఫుట్‌పాత్‌లపైనే నిలబడి పయనిస్తున్నారు. లోపలికి రమ్మంటే వినే పరిస్థితి లేదు. ఎక్కడ పడిపోతారేమోనని భయపడాల్సిన పరిస్థితి. గతంలో డబుల్ డోర్ బస్సులతో సమస్యలు తలెత్తేవి. ఇపుడు సింగిల్ డోర్ ఉండడంతో కొంతమేర ఇబ్బందులు తప్పాయి. – ఎస్.లీలావతి, మహిళా కండక్టర్ చిల్లర సమస్య వేధిస్తోంది ఆర్టీసీలో 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాను. విధినిర్వహణలో ఎక్కువగా చిల్లర సమస్య వేధిస్తోంది. ఇందుకోసం ప్రయాణికులు గొడవలు పడిన సందర్భాలు అనేకం. కొంతమంది దురుసుగా కూడా ప్రవర్తిస్తుంటారు. మహిళా కండక్టర్ల సమస్యలు యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదు. మహిళా కండక్టర్లకు విశ్రాంతి లేదు. – డి.వనజాక్షి, మహిళా కండక్టర్ -
సమస్యల హారన్
డిమాండ్ల సాధనకు మహిళా కండక్టర్ల సమరం కష్టాలు ఎదురీదుతూ.. ఒత్తిడిని జయిస్తూ.. ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : రైట్ రైట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కండక్టర్లు. కండక్టర్ ఉద్యోగం అంటేనే కొందరు పురుషులు జంకుతుంటారు. అలాంటిది ఆర్టీసీ లో పురుషులకు దీటుగా మహిళా కండక్లర్లూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో భర్త, పిల్లలకు సేవచేస్తూనే ఇటూ ఉద్యోగంలోనూ దూసుకెళ్తు న్నారు. అయినా.. నిత్యం వారికి కష్టాలు తప్పడం లేదు. కార్మిక చట్టం ప్రకారం 7.20 గంటలు పనిచేయాలి. కానీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఎనిమిది గంటలపాటు పనిచేస్తున్నారు. వేతనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మహిళా కండక్టర్లకు ప్రత్యేక సౌకర్యాలు కనిపించవు. మహిళా సంఘాలు కూడా సమస్యలపై పోరాటాలు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా, 219 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లో డిపోలో 45, ఆసిఫాబాద్‌లో 23, భైంసాలో 22, మంచిర్యాలలో 85, నిర్మల్‌లో 41, ఉట్నూర్‌లో 3 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరి సమస్యలు పరిష్కారంలో ఆర్టీసీ అధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నారు. 240 రోజులకు బదులు 120 రోజులకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతో అవస్థలు పడుతున్నారు. మహిళా కండక్టర్ల డిమాండ్లు.. ముందస్తుగా పెట్టుకున్న సెలవులు మంజూరుచేయాలి. {పసూతి సెలవులు 240 రోజులు ఇవ్వాలి. ఆయా డిపోల్లో ప్రత్యేక విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, భోజన గదిని నిర్మించాలి. కార్మిక చట్టం ప్రకారం వారాంతపు సెలవులు ఇవ్వాలి. రాత్రి ఎనిమిది గంటల లోపు ఇంటికి చేరాలా డ్యూటీలు వేయాలి. డే ఔట్ డ్యూటీ చేసిన తర్వాత ప్రత్యేక సెలవు ఇవ్వాలి. ఒక రోజు తప్పించి ఒక రోజు డే ఔట్.. డే డ్యూటీలు వేయాలి. మహిళా కండక్టర్ యూనిఫాంలను అందించాలి. ఎండీ సర్క్యూలర్ ప్రకారం ఫిక్స్డ్ చాట్ వేయాలి.