కోఠి ప్రసూతి ఆస్పత్రిలో దారుణం | new born baby dies in King Koti Maternity Hospitals | Sakshi
Sakshi News home page

కోఠి ప్రసూతి ఆస్పత్రిలో దారుణం

Apr 5 2015 4:16 PM | Updated on Oct 17 2018 3:53 PM

డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక మహిళ ఆరుబయటనే బిడ్డకు జన్మనిచ్చింది.

హైదరాబాద్: డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక మహిళ ఆరుబయటనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో జరిగింది. నల్లగొండకు చెందిన సుమలత పురుటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆరుబయటనే ప్రసవించింది.

 

అయితే, ప్రమాదవశాత్తు అప్పుడే పుట్టిన బాలుడు కింద పడటంతో తల పగిలి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వైద్యుల లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని ఆందోళనకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement