హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి మహిళా వాష్‌రూమ్ ఫ్లష్ ట్యాంకులో శిశువు డెడ్ బాడీ లభించడం హృదయ విదారకంగా మారింది. ఓ మహిళ ప్రసవం అనంతరం శిశువును ఫ్లష్ ట్యాంక్‌లో పడేసింది. ఆపై అక్కడ నుంచి పరారైంది.
ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనతో అంతా షాక్‌కు గురౌతున్నారు. అప్పుడే పుట్టిన పసికందను ఇలా ఫ్లష్ ట్యాంక్‌లు పడేయడం ఏంటని విస్తుపోతున్నారు.


