రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు లీగల్ నోటీసులు | My Home rameswara rao sends legal notice to Revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు లీగల్ నోటీసులు

Oct 8 2014 2:12 PM | Updated on Oct 16 2018 5:04 PM

రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు లీగల్ నోటీసులు - Sakshi

రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు లీగల్ నోటీసులు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మై హోం కన్‌స్ట్రక్షన్స్ రామేశ్వరరావు లీగల్ నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి  మై హోం కన్‌స్ట్రక్షన్స్ రామేశ్వరరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం కలిగిందంటూ రూ.90 కోట్లుకు లీగల్ నోటీసులు ఇచ్చారు.  మరోవైపు రేవంత్ రెడ్డి లీగల్ నోటీసులపై స్పందిస్తూ తన ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా మెట్రో రైలు ప్రాజెక్టు భూమిని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారంటూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మెట్రో భూమిని  రామేశ్వరరావు భాగస్వామిగా ఉన్న ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు ఇచ్చారని టీడీపీ ఆరోపించగా... అదేమీ లేదని, తమ భూమి తమ వద్దనే ఉందని ఎల్‌అండ్‌టీ వివరణ ఇచ్చింది. అయినా తగ్గని టీడీపీ.. రామేశ్వర్‌రావుకు కేసీఆర్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని, బహిరంగ చర్చకు రావాలని సవాళ్లకు దిగింది. దీనికి ప్రతిగా టీడీపీపై టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement