‘2019 ఎన్నికల లక్ష్యంగానే అమిత్‌ షా పర్యటన’ | muralidhar rao on amit shah telangana tour | Sakshi
Sakshi News home page

‘2019 ఎన్నికల లక్ష్యంగానే అమిత్‌ షా పర్యటన’

May 21 2017 6:55 PM | Updated on May 28 2018 3:58 PM

2019 ఎన్నికల లక్ష్యంగానే దక్షిణాదిలో అమిత్ షా పర్యటన ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు

నల్గొండ జిల్లా: 2019 ఎన్నికల లక్ష్యంగానే  దక్షిణాదిలో అమిత్ షా పర్యటన ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. దీనికి తెలంగాణను వేదిక చేసుకున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ బలపడటానికే అమిత్ షా టూర్ ఫ్లాన్ చేశామని చెప్పారు. 
 
స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని ఇప్పటి వరకు పాలించిన పార్టీలు మరిచిపోయాయని, వారి పోరాటపటిమ గుర్తుచేయడానికి నల్లగొండ జిల్లాలో విభిన్న ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు. పార్టీలో చేరడానికి నల్లగొండ, హైదరాబాద్, ఢిల్లీలో మా నేతలను ఇతర పార్టీల వారు సంప్రదిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో పార్టీలో చేరికలుంటాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement