వేములవాడ రూరల్‌లో ఎన్నికలకు బ్రేక్‌ | MPTC Elections In Vemulawada Rural Mandal Cancelled By High Court | Sakshi
Sakshi News home page

వేములవాడ రూరల్‌లో ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్‌

Apr 26 2019 4:57 PM | Updated on Apr 26 2019 5:04 PM

MPTC Elections In Vemulawada Rural Mandal Cancelled By High Court - Sakshi

తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండల పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. వేములవాడ రూరల్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ పున:పరిశీలించిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలంలో ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని తీగల రాంప్రసాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్‌ తాను వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే వేములవాడ రూరల్‌ మండలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్‌ ద్వారా కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు, వేములవాడ రూరల్‌ మండల ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement