బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం | Money in the bank account disappeared | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం

Jan 30 2018 6:47 PM | Updated on Jan 31 2018 11:13 AM

Money in the bank account disappeared - Sakshi

బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్న ఖాతాదారులు

రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో గల దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయ్యాయి. సుమారు 30 మందికి సంబంధించిన ఖాతాలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందింది. ఈ బ్యాంకు పరిధిలో ఎక్కువ మంది రైతులే బాధితులుగా ఉన్నట్లు తేలింది. బ్యాంక్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్లు వెల్లడైంది.ఈ రోజు కొందరు ఖాతాదారులు వారి డబ్బులను  తీసుకోవడానికి బ్యాంకుకి రావడంతో సిబ్బంది వారి ఖాతాలు పరిశీలించారు.

అందులో డబ్బులు లేకపోవడంతో విషయం బయటికి తెలిసింది. అంతే కాక వారికి బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలింది. సుమారు రూ.3 కోట్ల నిధులు మాయం అయినట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులను వివరణ కోరగా వారు ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలిపారు. దీంతో బాధితులు మీడియాని ఆశ్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement