నేడు మోస్తరు వర్షాలు

Moderate rains will be today says Hyderabad meteorological Centre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కేరళ, దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో శుక్రవారం ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. కోమోరిన్‌ ప్రాంతం నుంచి లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరో వైపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ప్రభావాల కారణంగా శనివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top