‘పెద్దతలలు బయటకు రావాలి’ | MLC Jeevan Reddy Comments Over Inter Board Failure | Sakshi
Sakshi News home page

‘పెద్దతలలు బయటకు రావాలి’

Apr 25 2019 2:41 PM | Updated on Apr 25 2019 2:53 PM

MLC Jeevan Reddy Comments Over Inter Board Failure - Sakshi

కేటీఆర్ కుమారుడికో, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుమారుడికో, లేక ఎంపీ కవిత కుమారుడికో...

సాక్షి, జగిత్యాల : 15 ఏళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించిన, అనుభవం కలిగిన మాగ్నటిక్ సంస్థను తప్పించి, ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించిన పెద్దతలలు బయటికి రావాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ కుమారుడికో, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుమారుడికో, లేక ఎంపీ కవిత కుమారుడికో ఇలాంటి అన్యాయం జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

సెక్షన్ 306 ( ఆత్మహత్యకు ప్రేరేపించడం) సెక్షన్420( ఒప్పందాలను ఉల్లంగించడం మోసగించడం) ఐపీఎస్ సెక్షన్ల ప్రకారం కేసులను నమోదు చేసి ఇంటర్మీడియట్ అవకతవకలకు పాల్పడిన దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డును, రెవెన్యూశాఖను తొలగించడం కాదు ముఖ్యమంత్రినే తొలగించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement