నాడు ఆదర్శం.. నేడు రాజకీయం | Sakshi
Sakshi News home page

నాడు ఆదర్శం.. నేడు రాజకీయం

Published Mon, Dec 8 2014 11:14 PM

నాడు ఆదర్శం.. నేడు రాజకీయం

రామచంద్రాపురం: జిల్లాలో ఒకప్పుడు ఆదర్శ పంచాయతీగా పేరొందిన ఉస్మాన్‌నగర్ ఇప్పుడు రాజ కీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వార్తల్లోకెక్కింది. సర్పంచ్ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తుండగా, సర్పంచ్‌తో పాటు ఆమె మద్దతు దారులు పంచాయతీ నిధులు ఒక్కపై సా కూడా పక్కదారి పట్టలేదని చెబుతున్నారు.

ప్రేమ్‌కుమార్ ఫిర్యాదుతో...
ఉస్మాన్‌నగర్ సర్పంచ్ కల్పన లక్షలాది రూపాయల గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన జిల్లా పంచాయతీరాజ్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆగ స్టు 20న గ్రామ పంచాయతీని సందర్శించి విచారణ నిర్వహించారు. అనంతరం రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. అయితే డీపీఓ పంచాయతీ నిధులతో నిర్మించిన మహిళా భవనాన్ని సందర్శించలేదని మరోసారి ఫిర్యాదు చేయడంతో నవంబర్ 20న డీఎల్‌పీఓ మనోహర్ గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాల ఆరోపణలను రికార్డు చేసుకొని వెళ్లారు.

నోటీసులు..సంజాయిషీ
అంతకుముందు డీపీఓ అక్టోబర్ 15న సర్పంచ్ కల్పనకు సుమారు రూ. 24 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో కొన్నిం టికి ఎంబీ రికార్డులు లేవని, మరి కొన్ని కొనుగోళ్లకు నేరుగా డబ్బులు చెల్లించారని దానిపై సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానిపై స్పందించిన సర్పంచ్ కల్పన అక్టోబర్ 22న తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇస్తూ సంజాయిషీ లెటర్‌ను పం పారు. తాను  ఖర్చు చేసిన ప్రతి పైసాకు సంబంధించిన రశీదులున్నాయని డీపీఓకు ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఒకనాడు జిల్లాకే ఆదర్శంగా ఉన్న గ్రామం నేడు రాజకీయ ఆరోపణలతో వార్తల్లోకెక్కడం గ్రామస్తులకు మింగుడు పడటం లేదు. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఉన్నతాధికారులు వివరాలు వెళ్లడిస్తే కానీ అసలు విషయం బయటపడదు.

రాజకీయ లబ్ధికోసమే ఆరోపణలు
రాజకీయ లబ్ధికోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు. స్పెషల్ అధికారుల పాలనలో ప్రభుత్వ భూములలో రోడ్లు వేస్తే అది కూడ నేనే చేశాననడం దారుణం. నేను బాధ్యతలు చేపట్టినప్పుడు గ్రామ పంచాయతీలో రూ. 63 లక్షల నిధులు ఉన్నాయి. పంచాయతీ అధికారుల అనుమతుల మేరకు అభివృద్ధి పనులు చేశాం. కూర్చునేందుకు కుర్చీ కొన్నా, అవినీతంటే ఏం చేయాలి.
 -కల్పన, సర్పంచ్
 
విచారణ సరిగ్గా జరగడం లేదు
గ్రామ సర్పంచ్ పం చాయతీ నిధులను దుర్వినియో గం చేశా రు. దీనిపై మేము జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ అధికారులు చేస్తున్న విచారణ తీరు సరిగ్గా లేదు. ప్రభుత్వ భూముల్లో రో డ్డు వేశారని మేము అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల సీసీ రోడ్డుపై సీసీ రోడ్డు వేశారు. నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి.
- ప్రేమ్ కుమార్, ఫిర్యాదుదారుడు

Advertisement
Advertisement