మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత | Minister sabitha indra reddy Join In Hospital WIth Health Problem | Sakshi
Sakshi News home page

మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత

May 16 2020 7:55 AM | Updated on May 16 2020 8:12 AM

Minister sabitha indra reddy Join In Hospital WIth Health Problem - Sakshi

సాక్షి, రంగారెడ్డి : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిరావడంతో కుమారుడు కార్తిక్‌రెడ్డి ఆమెను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమెను డిశ్చార్జి చేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న సబిత గురువారం రాత్రి 10.58 గంటలకు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో తదితర గుండె సంబంధమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అన్ని రిపోర్టులు కూడా నార్మల్‌ ఉన్నాయని, ఆందోళన అక్కర్లేదని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో సబితను పలువురు మంత్రులు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement