'లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తాం' | Minister Jagadish Reddy Visits Haliya | Sakshi
Sakshi News home page

'లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తాం'

Aug 27 2015 5:18 PM | Updated on Sep 3 2017 8:14 AM

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.

హాలియా (నల్లగొండ జిల్లా) : లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. మండలంలోని రామడుగు గ్రామంలో 33-11 సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లోవేల్టేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement