భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. ఢిల్లీతో ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలు నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
2025 చివరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా కుదిరిన కీలక ఒప్పందాలు, వ్యూహాత్మక లక్ష్యాలను మోదీ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. 2025లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుందని దీనిని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.
భారత్, రష్యాది కాల పరీక్షను ఎదుర్కొని నిలబడ్డ నిలిచిన స్నేహ బంధమని, సమానత్వం, విశ్వాసం, గౌరవం, ప్రయోజనాలను ఇరుదేశాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా భారత్, రష్యాల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారత్-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంలో 96 శాతం జాతీయ కరెన్సీలలోనే (రూపాయి-రూబుల్) జరుగుతుండటం విశేషమని ఆయన గుర్తుచేశారు.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల రష్యాకు ఎంతో గౌరవం ఉందని లావ్రోవ్ కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత్ ఒక గొప్ప శక్తిగా, ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు


