వలస కార్మికుల బస్సుకు తప్పిన ప్రమాదం | Migrant Workers Bus Accident At Nizamabad | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల బస్సుకు తప్పిన ప్రమాదం

May 4 2020 3:39 PM | Updated on May 4 2020 3:46 PM

Migrant Workers Bus Accident At Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి రాజస్తాన్‌ వెళ్తున్న వలస కార్మికులకు పెను ప్రమాదం తప్పింది. వలస కూలీలు వెళ్తున్న బస్సు  నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద అదుపు తప్పి చెట్టును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెవెన్యూ అధికారుల సహాయంతో రాజస్తాన్‌ వాసులకు భోజన ఏర్పాటు చేశారు. అనంతరం మరో బస్సులో కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement