ప్రారంభమైన మెడికల్ కౌన్సెలింగ్ | Medical counselling begin in telangana | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన మెడికల్ కౌన్సెలింగ్

Jul 29 2015 9:27 AM | Updated on Oct 9 2018 6:57 PM

తెలంగాణలో బుధవారం మెడికల్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నేడు 1 నుంచి 1000 ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం మెడికల్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది.  నేడు 1 నుంచి 1000 ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.  తెలంగాణలో జేఎన్టీయూ, ఓయూ, కేయూలో అధికారులు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఈ కౌన్సెలింగ్ వచ్చే నెల 6 వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సహకారంతో జరిగే ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ను తెలంగాణలో వరంగల్, హైదరాబాద్‌లోని మూడు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో, ప్రైవేటులోని ఏ కేటగిరీలో ఉన్న మొత్తం 50 శాతం సీట్లను ఈ కౌన్సెలింగ్ కింద భర్తీ చేస్తారు.

తెలంగాణలో 15 మెడికల్ కాలేజీల్లోని 1,550 ఎంబీబీఎస్, 606 దంత వైద్య సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, ఉస్మానియాలోని పీజీఆర్‌ఆర్ దూర విద్యా కేంద్రంలో, వరంగల్‌లోని కాకతీయవర్సిటీలో, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో ఓపెన్ కోటా కింద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని అందరికీ కలిపి నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement