మేడారం..జనసంద్రం | Medaram janasandram | Sakshi
Sakshi News home page

మేడారం..జనసంద్రం

Feb 1 2016 3:48 AM | Updated on Sep 3 2017 4:42 PM

మేడారం..జనసంద్రం

మేడారం..జనసంద్రం

ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు

అమ్మలను దర్శించుకున్న 4 లక్షల మంది

 ములుగు: ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం మేడారానికి సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ములుగు గట్టమ్మ, మేడారం వద్ద నార్లాపుర్-ఊరట్టం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి సిబ్బందిని అప్రమత్తం చేసి ట్రాఫిక్ నియంత్రింపజేశారు.

జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా కొన్ని కనెక్షన్‌లు మాత్రమే ఇవ్వడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.  ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా సిద్ధం చేయకపోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో పనులు జరగుతున్నాయని శనివారం వరకు ఒకవైపు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బారికేడ్లను తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement