మెదక్‌లో కారు.. హుషారు 

Medak Municipalities Elects New Municipal Chair Person And Vice Chairman  - Sakshi

సాక్షి, మెదక్‌ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్‌చైర్మన్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయా మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీశారు. టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అయితే ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి అవకాశం ఇచ్చారంటూ  కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు లాఠీచార్జీ చేయడంతో మెదక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. అయితే ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి అవకాశం ఇచ్చారంటూ   కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.  మెదక్‌లో ఉద్యమ సమయం నుంచి పారీ్టలో పనిచేసిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ లేదా అకిరెడ్డి కృష్ణారెడ్డిలకు చైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మల్లికార్జున్‌గౌడ్, కృష్ణారెడ్డిల మద్దతుదారులు ఆందోళనలకు దిగడంతో మెదక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థులతో క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు నుంచి ప్రత్యేక వాహనంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయానికి వస్తుండగా చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, కృష్ణారెడ్డిలను కాదని, చంద్రపాల్‌కు ఖరారైనట్లు ముందుగానే విషయం తెలుసుకున్న కార్యకర్తలు, వారి మద్దతుదారులు రాందాస్‌ చౌరస్తాలో కౌన్సిలర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన ఒకదశలో ఫలితం లేకుండా పోయింది. మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా పెద్ద ఎత్తున తరలివచి్చన కార్యకర్తలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనానికి అడ్డుపడ్డారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపధ్యంలో మల్లికార్జున్‌గౌడ్, కృష్ణారెడ్డిలు కంటతడిపెట్టుకొన్నారు.  

రెండు గంటల పాటు ఆందోళన 
భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్ల వాహనాన్ని పోలీసులు మున్సిపల్‌ కార్యాలయానికి తరలించి సభ్యులను లోపలికి పంపించారు. సుమారు రెండు గంటలపాటు ఆదోళనలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ సభ్యుల వెంట బీజేపీ సభ్యులు సైతం లోనికి వెళ్లడంతో అప్పటికే టీఆర్‌ఎస్‌కు కావాల్సిన కోరం ఉంది. కాగా ఆరుబయట రెండుగంటల అనంతరం మల్లికార్జున్‌గౌడ్, కృష్ణారెడ్డిలు పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు నచ్చజెప్పి ప్రమాణ స్వీకారం చేసేందుకు లోనికి వెళ్లారు. ఈ నేపధ్యంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ లోపల సైతం కంటతడిపెట్టాడు. కౌన్సిలర్‌ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్‌గా చంద్రపాల్, వైస్‌చైర్మన్‌గా మల్లికార్జున్‌గౌడ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

తూప్రాన్‌లో.. 
తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా బొంది రాఘవేంద్రగౌడ్, వైస్‌చైర్మన్‌గా నందాల శ్రీనివాస్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా తూప్రాన్‌ మున్సిపాలిటీలో ఉద్యమ కాలం నుంచి పనిచేసిన రాముని శ్రీశైలంగౌడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికవుతారని అక్కడ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈయన ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషించారు. కాని తీరా శ్రీశైలంగౌడ్‌ను పక్కనబెట్టి బొందిరాఘవెంద్రగౌడ్‌ను ఎంపిక చేయడంతో శ్రీశైలంగౌడ్‌ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్‌ మాట్లాడుతూ మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన తనకు మంత్రి హరీశ్‌రావు అన్యాయం చేశారని, ఇటీవల టీడీపీ నుంచి బొంది రాఘవేంద్రగౌడ్‌ను చైర్మన్‌గా ఎంపిక చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.  

రామాయంపేటలోనూ.. 
రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితెందర్‌గౌడ్, వైస్‌ చైర్మన్‌గా పుట్టి విజయలక్ష్మి ఎన్నికయ్యారు. కాగా రామాయంపేటలో మున్సిపల్‌ చైర్మన్‌గా పుట్టి విజయలక్షి్మకే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పుట్టి యాదగిరి మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు కావడంతో పుట్టి విజయలక్షి, యాదగిరికి చైర్మన్‌ పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు ఆశించారు. తీరా అధిష్టానం పల్లె జితెందర్‌గౌడ్‌ పేరును తెరపైకి తీసుకొని పదవీ అంటగట్టడంతో విజయలక్ష్మి నిరుత్సాహానికి గురై వైస్‌చైర్మన్‌గా మిగిలిపోయారు.  

నర్సాపూర్‌లో ప్రశాంతం 
నర్సాపూర్‌ మున్సిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎంపిక ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు నర్సాపూర్‌లో ప్రచారం చేసిన సమయంలో మురళీధర్‌ యాదవ్‌ను చైర్మన్‌గా ప్రకటించారు. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో మురళీధర్‌యాదవ్, వైస్‌చైర్మన్‌గా నహీమొద్దీన్‌లను ఎంపిక చేశారు. కాగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌చైర్మన్లు టీఆర్‌ఎస్‌ పారీ్టకి చెందినవారే.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top