వైద్య సేవలో.. మెదక్‌ సెకండ్‌

Medak Got Second Place In Health Services - Sakshi

హర్షం వ్యక్తం చేసిన వైద్యాధికారులు 

మొదటి స్థానం కోసం కృషిచేస్తాం

డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు

సాక్షి, మెదక్: వైద్యసేవలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పేద ప్రజలకు వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన 12 సేవల్లో ద్వితీయ స్థానాన్ని మైదక్‌ కైవసం చేసుకుంది. సేవలకు ఫలితం దక్కడంతో వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 7,28,478 మంది జనాభా ఉండగా వారందరి ఆరోగ్య ప్రొఫైల్‌ను జిల్లా వైద్యశాఖ  ఆధ్వర్యంలో పొందుపర్చారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి డేటాను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. దీంతోపాటు గర్భిణుల సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందశాతం డెలివరీలు చేయడం, అర్హులైన ప్రతి గర్భిణికి కేసీఆర్‌ కిట్లు అందజేయడం, ఎప్పటికప్పుడూ టీబీ కేసులను నమోదు చేసి రోగులకు కాలానుగుణంగా చికిత్స, మెడిసిన్‌ అందించడం, ఒకటి నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లా రెండో స్థానం నిలిచింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. అందరి సహకారంతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top