ఎన్‌టీఆర్ భవన్‌లో మేడే వేడుకలు | may day celebrations in ntr bhavan | Sakshi
Sakshi News home page

ఎన్‌టీఆర్ భవన్‌లో మేడే వేడుకలు

May 2 2014 1:56 AM | Updated on Sep 2 2017 6:47 AM

కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతంగా పెరుగుతోందని, వారిని పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఎన్‌టీఆర్ భవన్‌లో మేడే సందర్భంగా గురువారం టీఎన్‌టీయూసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈవూరి మృతికి సంతాపం: మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. టీడీపీ బలోపేతానికి ఈవూరి సుబ్బారావు, సీతారావమ్మ దంపతులు కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి రామారావు మృతికి బాబు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement