వివాహిత ఆత్మహత్య | Married women committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Nov 14 2015 7:24 PM | Updated on Nov 6 2018 7:56 PM

కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

వరకట్న వేదింపులు ఓ గృహిణి ని బలితీసుకున్నాయి. కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నర్సాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన జీడి నర్సింహ్మాగౌడ్ భార్య లక్ష్మి(26) వంటిపై కిరోసిన్‌పోసుకొని నిప్పంటించుకొని మృతిచెందింది. గత కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం నర్సింహ్మగౌడ్ తన కూతురును వేదించడం వల్లే... ఆమె ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటుందని లక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement