వివాహితపై అత్యాచారం, హత్య | Married on the rape and murder | Sakshi
Sakshi News home page

వివాహితపై అత్యాచారం, హత్య

Jan 6 2015 12:19 AM | Updated on Aug 21 2018 5:46 PM

వివాహితపై అత్యాచారం, హత్య - Sakshi

వివాహితపై అత్యాచారం, హత్య

వాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

మృతురాలు గారెడ్డిపేట వాసి?
తూప్రాన్ : వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన మండలంలోని రామాయిపల్లి పంచాయతీ పాలాట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలాట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పలువురు పశువులను సోమవారం తోలుకెళ్లారు. అయితే అక్కడి పొదల్లో ఉన్న మహిళా మృత దేహాన్ని వారు గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు చేరవేయ గా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, ఎస్‌ఐ సం తోష్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదే హాన్ని పరిశీలించారు. మహిళను పది రోజుల క్రితం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, ఒంటిపై కేవ లం ఎర్రని జాకెట్ మాత్రమే ఉందన్నారు.

మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో సంఘటనా స్థలంలోనే గజ్వేల్ ప్ర భుత్వాస్పత్రి వైద్యులను పిలిపించి పంచనామా నిర్వహించి  ఖననం చేశారు.
 
లింగారెడ్డిపేట వాసిగా అనుమానం..?
మృతురాలు మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన వివాహితగా పోలీసులు అనుమానిస్తున్నారు. లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన సురారం యశోద (30)కు కౌడిపల్లి మండలం చందంపేటకు చెందిన శేఖర్‌తో వివాహం జరగ్గా వీరు ఇల్లరకం ఉన్నారు. కాగా కొన్నేళ్ల క్రితం శేఖర్ ఇల్లు వదలి వెళ్లిపోయాడు. అయితేవీరికి ఇద్దరు పిల్లలు కావడంతో కుటుంబ పోషణ కష్టం మాంతో దీంతో యశోద పట్టణంలోని ఓ దాదా హోటల్లో కూలీ పనిలో  చేరింది.

ఈ క్రమంలోనే డిసెంబరు 29న సోమవారం ఉదయం కాళ్లకల్‌లో డబ్బులు వచ్చేది ఉందని ఇంట్లో తల్లి నర్సమ్మతో చెప్పి యశోద బయటకు వచ్చింది. అదే రోజు రాత్రికి ఇంటికి చేరుకోలేదు. దాబా హోటల్లో తెలుసుకుంటే వారు కూడా పనికి రాలేదని తెలిపారన్నారు. దీంతో బంధువుల ఇంటికి వెళ్లిందని భావించింది. అయితే పాలాట సమీపంలోని అటవీ ప్రాంతంలోని మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న తల్లి నర్సమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి తన కుమార్తెదేనంటూ విలపించింది. కాగా.. పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పష్టతకు రాలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement