breaking news
Women deadbody
-
‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’
తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ అనే మహిళ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్యతో పాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలిసీ, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనితో మారీసుపేట, మల్లెపాడు గ్రామంలో కలకలం రేగింది.ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా వివరాల సేకరణతెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరాల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హత్యకు ప్లాన్ ఇలా..హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం. -
సూట్ కేసులో మహిళ మృతదేహం
దుండిగల్: సూట్ కేసులో ఓ మహిళ అస్తి పంజరం లభ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంభీపూర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కల్వర్ట్ వద్ద ఉన్న ఓ సూట్ కేసులో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూట్ కేసును తెరిచి చూడగా అందులో ఓ మహిళ అస్తి పంజరం కనిపించింది. వారం రోజుల క్రితం సదరు మహిళను హత్య చేసి సూట్‌కేసులో తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితపై అత్యాచారం, హత్య
మృతురాలు గారెడ్డిపేట వాసి? తూప్రాన్ : వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన మండలంలోని రామాయిపల్లి పంచాయతీ పాలాట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలాట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పలువురు పశువులను సోమవారం తోలుకెళ్లారు. అయితే అక్కడి పొదల్లో ఉన్న మహిళా మృత దేహాన్ని వారు గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు చేరవేయ గా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, ఎస్ఐ సం తోష్కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదే హాన్ని పరిశీలించారు. మహిళను పది రోజుల క్రితం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, ఒంటిపై కేవ లం ఎర్రని జాకెట్ మాత్రమే ఉందన్నారు. మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో సంఘటనా స్థలంలోనే గజ్వేల్ ప్ర భుత్వాస్పత్రి వైద్యులను పిలిపించి పంచనామా నిర్వహించి ఖననం చేశారు. లింగారెడ్డిపేట వాసిగా అనుమానం..? మృతురాలు మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన వివాహితగా పోలీసులు అనుమానిస్తున్నారు. లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన సురారం యశోద (30)కు కౌడిపల్లి మండలం చందంపేటకు చెందిన శేఖర్‌తో వివాహం జరగ్గా వీరు ఇల్లరకం ఉన్నారు. కాగా కొన్నేళ్ల క్రితం శేఖర్ ఇల్లు వదలి వెళ్లిపోయాడు. అయితేవీరికి ఇద్దరు పిల్లలు కావడంతో కుటుంబ పోషణ కష్టం మాంతో దీంతో యశోద పట్టణంలోని ఓ దాదా హోటల్లో కూలీ పనిలో చేరింది. ఈ క్రమంలోనే డిసెంబరు 29న సోమవారం ఉదయం కాళ్లకల్‌లో డబ్బులు వచ్చేది ఉందని ఇంట్లో తల్లి నర్సమ్మతో చెప్పి యశోద బయటకు వచ్చింది. అదే రోజు రాత్రికి ఇంటికి చేరుకోలేదు. దాబా హోటల్లో తెలుసుకుంటే వారు కూడా పనికి రాలేదని తెలిపారన్నారు. దీంతో బంధువుల ఇంటికి వెళ్లిందని భావించింది. అయితే పాలాట సమీపంలోని అటవీ ప్రాంతంలోని మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న తల్లి నర్సమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి తన కుమార్తెదేనంటూ విలపించింది. కాగా.. పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పష్టతకు రాలేకపోతున్నారు.