బతుకమ్మ పూల కోసం వెళ్లి మృత్యువాత | Man dies of electrocution | Sakshi
Sakshi News home page

బతుకమ్మ పూల కోసం వెళ్లి మృత్యువాత

Oct 20 2015 3:16 PM | Updated on Oct 30 2018 7:50 PM

బతుకమ్మ పూల కోసం వెళ్లి మృత్యువాత - Sakshi

బతుకమ్మ పూల కోసం వెళ్లి మృత్యువాత

బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

కాళేశ్వరం (కరీంనగర్) : బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం మెట్‌పల్లి గ్రామ శివారులో మంగళవారం ఈ ఘటన జరిగింది. వెన్నపురెడ్డి బాల్‌రెడ్డి (58) బతుకమ్మ కోసం టేకు పూలను తీసుకొచ్చేందుకు గ్రామం సమీపంలోని పంప్ హౌస్ వద్దకు వెళ్లాడు. అక్కడ టేకు చెట్టు పక్కనే 33కేవీ విద్యుత్ లైన్ తీగలు ఉన్నాయి.

ఇది గమనించని బాల్‌రెడ్డి చెట్టు ఎక్కి పూలను కోసే క్రమంలో కొమ్మ విరిగి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడిపోయింది. విద్యుదాఘాతంతో బాల్‌రెడ్డి చెట్టుపైనే ప్రాణాలు విడిచాడు. ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా అనంతరం మృతదేహాన్ని మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement