పిడుగుపాటుకు వ్యక్తి మృతి | Man dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Jul 2 2015 11:12 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మోదిగూడ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మోదిగూడ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు.  వివరాల్లోకి వెళ్తే.. మోదిగూడ గ్రామానికి చెందిన కనక మారుతి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి వ్యవసాయ బావి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపడి మృతిచెందాడు. అయితే రాత్రి నుంచి మారుతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం వెతుక్కుంటూ వెళ్లి చూడగా వ్యవసాయబావి వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement