ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి


తిర్యాణి : ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పందిరిమాగడ ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం సాయంత్రం ట్రాక్టర్ పందిరిగూడ నుంచి రాఘవాపూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఇంజిన్ పైకి లేచి బోల్తా పడటంతో డ్రైవర్ భీమ్‌రావు దాని కింద చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. మృతుడు సాలెగూడ గ్రామవాసి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top